కుళ్లిన మాంసం.. పురుగులు పట్టిన సామగ్రి
కుదిరితే కుటుంబసమేతంగా.. వీలైతే ఫ్రెండ్స్‌తో సరదాగా.. హోటల్‌కి రెస్టారెంట్లకి వెళ్తున్నాం. వాళ్లు వడ్డించింది తినేసి వస్తున్నాం. కానీ అది ఎంత దరిద్రమైన వాతావరణంలో చేస్తున్నారో తెలుసా..? ఎన్ని రోజులు నిల్వ చేసిన మాంసాన్ని వండి పెడుతున్నారో గమనించారా..? ఇవన్నీ తెలిస్తే మీరు హోటల్‌కి వెళ్లాలంటేనే జడుసుకుంటారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం హోటళ్లలో తనిఖీలు చేసిన అధికారులకు కండ్లు బైర్లు కమ్మాయి…
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పలు హోటళ్లు, స్వీట్ షాపులపై మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మామ్స్ కిచెన్ హోటల్లో తనిఖీల్లో కుళ్లిన ఆహార పదార్థాలు బయటపడ్డాయి. కుళ్లిపోయిన మాంసంతో పాటు వాటిని నిల్వ ఉంచే ఫ్రిడ్జ్ ల్లో పురుగులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అదేవిధంగా వెంకటేశ్వర స్వీట్ హోం తనిఖీ లో సైతం పాత స్వీట్లు బయటపడ్డాయి. హోటళ్లు,స్వీట్ హౌస్ ల్లో పారిశుద్ధ్య లోపంపై మున్సిపల్ అధికారుల ఆగ్రహం వ్యక్తం చేశారు.