పండుగలను సంతోషంగా జరుపుకోవాలి
ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు

పండుగలను సంతోషంగా జరుపుకోవాలనీ ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు స్పష్టం చేశారు. శనివారం రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లా అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని మతాలు చెప్పేది ఒక్కటేనని, మనషులంతా సోదర భావంతో కలిసి మెలిసి ఉండాలని ఆకాంక్షించారు.. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విరమింపజేశారు.
పండుగలను మతాలకు అతీతంగా కలిసిమెలసి జరుపుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లాలో అన్ని పండుగలను మత సామరస్యంతో వేడుకలా నిర్వహించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.