పోలీసుల అదుపులో మాజీ ఎమ్మెల్యే షకీల్

బీఆర్ ఎస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే షకీల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైద‌రాబాద్ లోని ప్ర‌జాభ‌వ‌న్ వ‌ద్ద జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఆయ‌న‌పై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. కొన్ని నెల‌లుగా ఆయ‌న దుబాయ్‌లో ఉంటున్నారు. ష‌కీల్ తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చారు. వివిధ కేసుల్లో షకీల్‌పై అరెస్ట్‌ వారెంట్లు సైతం ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే పోలీసులు ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు. అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనుమతిచ్చిన పోలీసులు, అనంత‌రం విచారించే అవ‌కాశం ఉంది.

ష‌కీల్ కుమారుడు సాహిల్ గ‌తంలో కారు న‌డుపుతూ ప్ర‌జాభ‌వ‌న్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్ల‌ను ఢీకొట్టాడు. ఈ కేసు నుంచి కుమారున్ని త‌ప్పించేందుకు ష‌కీల్ ప్ర‌య‌త్నించార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

You might also like