అదనంగా ఐదు ఇసుక రీచ్‌లు మంజూరు

మంచిర్యాల జిల్లాలో అభివృద్ధి పనులు, ప్రజల అవసరాల కోసం నూతనంగా 5 ఇసుక రీచులను మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్ సభావత్ మోతిలాల్ తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నూతనంగా ముల్కల్ల, వేంపల్లి-1, వేంపల్లి-2, తాళ్లపల్లి, ఇందారంలో ఇసుక రీచ్‌లను ప్రారంభిస్తామన్నారు. ఈ రీచుల్లో రోడ్డు, ర్యాంపు వర్క్స్ నిర్వహణ సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్, గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో మైన్స్ అండ్ జియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ జగన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.