ఉగ్ర‌దాడికి వ్య‌తిరేకంగా మంచిర్యాల బంద్‌

Manchiryala: జ‌మ్మూ కాశ్మీర్ పహల్గాం(Pahalgam)లో పర్యాటకులపై జరిగిన దాడిని ఖండిస్తూ చేస్తున్న మంచిర్యాల కార్పొరేష‌న్లో బంద్ నిర్వ‌హిస్తున్నారు. మంచిర్యాల హిందూ ఐక్యవేదిక,ఛాంబర్ ఆఫ్ కామర్స్, కుల సంఘాలు,కార్మిక సంఘాలు,అన్ని రాజకీయ పార్టీలు ఈ బంద్‌లో పాల్గొంటున్నాయి. ఉగ్రదాడిలో చనిపోయిన మృతుల ఆత్మకు శాంతిచేకూరాలని కోరూతూ బంద్ పాటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పట్టణంలో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తున్నారు. ఒక్క షాపు కూడా తెరచుకోకపోవడంతో వీధులన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. ఈ సంద‌ర్బంగ ప‌లువురు మాట్లాడుతూ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పాకిస్తాన్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమండ్ చేశారు. ఉగ్ర‌వాదాన్ని తుద ముట్టించే వర‌కు భార‌త్ వెన‌క‌డుగు వేయ‌వ‌ద్ద‌ని, భార‌తీయులు అంతా కేంద్ర ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా నిలుస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like