తెలంగాణ కాంగ్రెస్ కమిటీల ఏర్పాటు

Telangana Congress Committees: తెలంగాణ కాంగ్రెస్ కమిటీల ఏర్పాటుపై ఏఐసీసీ ఆమోదం తెలిపింది. పోలిటికల్ అఫైర్స్, అడ్వైజరీ, డిలిమిటేషన్, రాజ్యాంగ పరిరక్షణ, అనుశాసన కమిటీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా ప్రకటించిన కమిటీలను వెంటనే అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావుతో సహా మొత్తం 22 మంది సభ్యులతో పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో అదనంగా ఏఐసీసీ కార్యదర్శులు, రాష్ట్ర మంత్రులకు ప్రత్యేక ఆహ్వానం ఉండనుంది.
తెలంగాణ కాంగ్రెస్ అడ్వైజరీ కమిటీలో రేవంత్ రెడ్డి, మధు యాష్కి, గీతారెడ్డి, జానా రెడ్డితో సహా మొత్తం 15 మంది సభ్యులతో అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేశారు. డిలిమిటేషన్ కమిటీకి ఛైర్మన్‌గా ఛల్లా వంశీచంద్ రెడ్డి ఉండనుంగా, గద్వాల విజయలక్ష్మి, ఆది శ్రీనివాస్, శ్రవణ్ రెడ్డితో సహా మొత్తం 7 మంది సభ్యులతో డిలిమిటేషన్ కమిటీ ఏర్పాటు చేశారు. సంవిధాన్ బచావో కార్యక్రమ కమిటీకి పి వినయ్ కుమార్ ఛైర్మన్ గా, అద్దంకి దయాకర్, ఎం ఎల్ఏ బాలు నాయక్, అర్కాల నర్సారెడ్డితో సహా కమిటీలో మొత్తం 16 మంది సభ్యులు ఉంటారు.
ఇక క్రమశిక్షణా చర్య కమిటీకి మల్లు రవి ఛైర్మన్ గా ఉండనున్నారు. ఇక వ్యవస్థాపక చర్యల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయగా, దానికి శ్యామ్ మోహన్ ను వైస్ ఛైర్మన్ గా నియమించారు.