ఆ కార్డు ఉన్న మ‌హిళ‌ల‌కు ఉచిత వైద్యం

Telangana: తెలంగాణ ప్ర‌భుత్వం మ‌హిళ‌ల కోసం మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించింది. దీనికి సంబంధించి ముఖ్య‌మంత్రి తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ప్రకటించారు.. ఈ ప‌థ‌కానికి సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి… రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మహిళలు మూల స్తంభాలని చెప్పిన రేవంత్ రెడ్డి త్వ‌ర‌లో మహిళా సంఘాలకు క్యూఆర్ కోడ్ తో కూడిన కార్డులు ఇవ్వ‌నున్న‌ట్లు చెప్పారు. ఈ క్యూఆర్ కోడ్ కార్డు ఉన్న మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయించే పథకాన్ని తీసుకువస్తామని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

మ‌హిళ‌ల‌ను కోటీశ్వ‌రుల‌ను చేయాల‌నే సంక‌ల్పంతో ముందుకు వెళ్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నో వేదిక‌ల‌పై వెల్ల‌డించారు. దానిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. మహాలక్ష్మీ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. దీంతో పాటుగా రూ.500కే గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తోంది. ఆర్టీసికి కేటాయించిన అద్దె బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు సైతం స్థానం క‌ల్పించారు. జిల్లా కేంద్రాల్లో మహిళలకు పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలను ఇప్పించేలా చ‌ర్య‌లు తీసుకుంది.

ఇలా మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేక ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టిన ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి మహిళా సంఘాల్లో ఉన్న వారి కోసం ప్ర‌త్యేకంగా కార్డులు కేటాయించి వాటి ద్వారా ఉచిత వైద్య ప‌రీక్ష‌లు చేయిస్తాన‌ని ప్ర‌క‌ట‌న చేయ‌డం ప‌ట్ల ప‌లువురు మ‌హిళ‌లు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like