ఏసీసీ క్వారీలో పడి యువకుడి మృతి

ACC:మంచిర్యాల జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న ఏసీసీ క్వారీలో పడి యువకుడు మృతి చెందాడు. క్వారీలోని నీటి కుంటలో ప్రమాదవశాత్తు పడిన హర్షవర్ధన్ అనే విద్యార్థి మృత్యువాత పడ్డాడు. మంచిర్యాల పట్టణం జాఫర్ నగర్ కు చెందిన ఐదుగురు స్నేహితులు ఏసీసీ క్వారీకి వెళ్లారు. క్వారీలోని నీటి కుంట వద్దకు వెళ్లి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి హర్షవర్ధన్ గల్లంతయ్యాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చేపట్టి హర్షవర్ధన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.