ఫోన్‌పేలో లంచం

ACB: మంచిర్యాల జిల్లాలో భూమి సర్వే చేయడానికి లంచం తీసుకోవడమే కాకుండా, ఇంకా డబ్బులు కావాలని డిమాండ్ చేసిన సర్వేయర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.. వివరాల్లోకి వెళితే.. తన భూమి సర్వే చేసి సర్టిఫికెట్ ఇవ్వాలని ఓ వ్యక్తి మంచిర్యాల సర్వేయర్ మంజులను ఓ వ్యక్తి కలిశారు. అయితే, ఆ భూమి సర్వే చేయాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిన సర్వేయర్ మంజుల ఒకసారి 16,500 ఫోన్ పే ద్వారా, పదివేలు నేరుగా తీసుకుంది. అది కాకుండా మరో ముప్పై వేలు డిమాండ్ చేసింది. అది ఇస్తే కానీ తాము పని చేయమని చెప్పారు.
దీంతో విసుగు చెందిన వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సర్వేయర్ మంజులతో పాటు, చైన్‌మెన్‌ను అదుపులోకి తీసుకుని తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ విచారణ చేపట్టారు. గురువారం కోర్టులో ప్రవేశపెడతామని అధికారులు వెల్లడించారు.