నిర్మల్ లో ఏసీబీ ట్రాప్.. ఆర్ఐ అరెస్ట్

ACB TRAP: నిర్మల్ జిల్లా కేంద్రంలోనీ నిర్మల్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇంటి నంబర్ల కోసం డబ్బులు తీసుకుంటుండగా ముసిపల్ అధికారితో పాటు, ఓ కాంట్రాక్ట్ ఉద్యోగిని సైతం అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్ పట్టణంలో కొత్తగా ఇంటిని నిర్మించుకున్న బాధితుడి ఇంటికి వాల్యూయేషన్ వేయడంతో పాటు ఇంటి నంబర్ మంజూరు చేసేందుకు మునిసిపల్ రెవెన్యూ ఇన్స్ పెక్టర్ గైక్వాడ్ సంతోష్ కుమార్ లంచం అడిగారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఎండీ షోయబ్ అహ్మద్ ద్వారా రూ. 6 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.