ఉత్తుత్తి పోలీస్ స్టేష‌న్‌

Fake Police Station:అది మారుమూల గ్రామంలో ఉన్న పోలీస్‌స్టేష‌న్.. ఆ ఎస్ఐ ఎప్ప‌టిక‌ప్పుడు అన్నింటిపై నిఘా పెట్టేవాడు. నిత్యం పెట్రోలింగ్‌, మ‌ద్యం అక్ర‌మ ర‌వాణాపై దాడులు కొన‌సాగేవి. వాహ‌న‌దారుల‌పై కేసులు, డ‌బ్బులు వ‌సూళ్లు న‌డిచేవి. కానీ, అస‌లు విష‌యం తెలుసుకున్న స్థానికులు, పోలీసులే షాక‌య్యారు.. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే..

బీహార్ రాష్ట్రంలోని పుర్ణియా జిల్లాలో రాహుల్ కుమార్ షా అనే వ్య‌క్తికి ప‌ని పాటా ఏం లేదు.. ఖాళీగా ఉండేవాడు.. ఓ ప‌ని మీద పోలీస్‌స్టేష‌న్ వెళ్లాల్సి వ‌చ్చింది.. అక్క‌డికి వెళ్లిన రాహుల్ కుమార్‌కు ఓ ఐడియా వ‌చ్చింది.. తానే ఓ పోలీస్‌స్టేష‌న్ పెడితే ఎలా ఉంటుంద‌నేదే ఆ ఆలోచ‌న‌. అనుకున్న‌దే త‌డ‌వుగా మారుమూల గ్రామ‌మైన బ‌టౌనాలో పోలీస్‌స్టేష‌న్ ఏర్పాటు చేశారు. త‌న కింద సిబ్బంది కావాలి క‌దా. ఉద్యోగాల పేరుతో గ్రామంలోని యువత నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు. గ్రామీణ రక్షాదళ్ రిక్రూట్మెంట్ పేరుతో కానిస్టేబుల్, చౌకీదార్ నియమకాలు చేపట్టాడు.

ఇందుకోసం స్థానిక యువత నుంచి రూ. 25 వేల నుంచి రూ. 50 వేల వరకు వసూలు చేశాడు. ఇలా నియమితులైన 300 మందికి పోలీసు యూనిఫాంలు, లాఠీలు, ఐడీకార్డులు సైతం అందజేశాడు. వారితో పెట్రోలింగ్, లిక్కర్ అక్రమ రవాణాపై దాడులు చేయించాడు. ఇలా నియమితులైన ఫేక్ పోలీసులు నిందితుల నుంచి డబ్బులు వసూలు చేశారు. వచ్చిన డబ్బులో సగం తాను తీసుకొని మిగతా సగాన్ని తన కింది ఉద్యోగులకు ఇచ్చేవాడు.

దాదాపు ఏడాది పాటు ఈ వ్య‌వ‌హారం ఇలాగే కొన‌సాగింది. అటు వైపు వెళ్లిన పోలీసుల‌కు ఈ వ్య‌వ‌హారం తెలియ‌డంతో కూపీ లాగారు. దీంతో ఉన్న‌తాధికారుల‌తో స‌హా అంతా నోరెళ్ల‌బెట్టాల్సి వ‌చ్చింది. ఎట్ట‌కేలకు గుట్టు బ‌య‌ట‌ప‌డటంతో రాహుల్ కుమార్ షాతో పాటు అంద‌రినీ పోలీసులు అరెస్టు చేసి జైలుకు త‌ర‌లించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like