అమాత్య యోగం.. అన్నకు వందనం

Minister Vivek:నిన్నా మొన్నటి వరకు మంత్రి పదవి కోసం అన్నదమ్ములు ఇద్దరూ పోటీ పడ్డారు. తమ ప్రయత్నాలు తాము చేశారు. చివరికి పదవి తమ్ముణ్ణి వరించింది. అన్నా మంత్రిని అన్నా ఆశీర్వదించమంటూ తమ్ముడు కాళ్ళు మొక్కాడు…

మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, ఆయన అన్న వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యే ఇద్దరూ మంత్రి పదవి కోసం పోటీ పడ్డారు. తమకు ఉన్న పరిచయాల ద్వారా పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అటు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, ఇటు ఢిల్లీలో AICC పెద్దలని కలుస్తూ మంత్రి పదవి తనకే కావాలని ఇద్దరూ ప్రయత్నాలు చేశారు.

మల్లికార్జున ఖర్గే వీరి తండ్రికి మంచి స్నేహితుడు కావటంతో ఆయన్ని నేరుగా కలవడమే కాకుండా, మిగతా వారితో సైతం చెప్పించారు. ఈ సందర్భంగా అన్నా తమ్ముడు ఇద్దరి మధ్య పొరపొచ్చాలు సైతం వచ్చాయి. కొద్ది రోజులు మాట్లాడుకోవడం కూడా మానేసినట్లు ప్రచారం జరిగింది.

చివరకు మంత్రి పదవి తమ్ముడూ వివేక్ ని వరించింది. ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, బుధవారం అన్న వినోద్ ఇంటికి వచ్చారు. అన్నా వదినల ఆశీర్వాదం తీసుకున్నారు.

You might also like