ముగ్గురు మంత్రులకు శాఖల కేటాయింపు

Telangana Ministers:తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖల కేటాయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్ద ఉన్న శాఖల్లో ముఖ్యమైన హోంశాఖ, విద్య, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలను అట్టిపెట్టుకుని మిగిలిన శాఖలను కేటాయించారు. జి.వివేక్ వెంకటస్వామికి కార్మిక, మైనింగ్ శాఖలను కేటాయించారు. అడ్లూరి లక్ష్మణ్‌కు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖ ఇచ్చారు. వాకిటి శ్రీహరికి పశు సంవర్థక, స్పోర్ట్స్ , యూత్ శాఖలను కేటాయించారు.