రక్తహీనత అధిగమించేందుకు సరైన ఆహారం తీసుకోవాలి

రక్తహీనతను అధిగమించడానికి ఇనుము, విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలని ఎంఎల్‌హెచ్‌పీ శ్రావణి, ఆకాంక్ష అన్నారు. కాసిపేట మండలం పాత తిరుమలాపూర్‌లో రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహన కొలాం గిరిజన మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తహీనత తగ్గించేందుకు మొలకెత్తిన విత్తనాలు, గుడ్లు, పాలు, ఆకుకూరలు, చిక్కుళ్ళు, పండ్లు, నిమ్మ, ఉసిరి, జామ, టొమాటోలు ఎక్కువగా తీసుకోవాలన్నారు.
ఈ సందర్భంగా నెలసరి సమస్యల సందర్భంగా పాటించాల్సిన పరిశుభ్రత గురించి వారికి వివరించారు. రక్తహీనత బారిన పడకుండా తీసుకునే ఆహారం చర్యల గురించి సైతం వివరించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం శోబారాణి, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.