అరవై రోజులు గడువు కావాలి.. స్థానిక ఎన్నికలపై హైకోర్టుకు ఎన్నికల సంఘం విన్నపం

High Court On Gram Panchayat Elections : స్థానిక సంఘం ఎన్నికలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ ఎన్నికలపై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. స్థానిక సంస్థల (పంచాయతీ) ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం నెల రోజుల గడువు కోరగా, ఎన్నికల కమిషన్ మాత్రం 60 రోజుల గడువును కోరింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్, ప్రభుత్వం, పిటిషనర్ల వాదనలు న్యాయస్థానంలో ముగిశాయి. దీంతో తీర్పును ఉన్నత న్యాయస్థానం రిజర్వ్ చేసింది.
మాజీ సర్పంచ్‌లు వేసిన కేసిది..
తెలంగాణలో సర్పంచ్ పదవీ కాలం 2024 ఫిబ్రవరి 1వ తేదీతో ముగిసింది. ఎంపీటీసీ సభ్యుల పదవీ కాలం 2024 జులై 5తో పూర్తయింది. ఆరు నెలలలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ప్రభుత్వం జాప్యం చేస్తూ వచ్చింది. రాజ్యాంగ ప్రకారం ఆరు నెలలలోపు లేదా ఆరు నెలల ముందైనా నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ సర్పంచ్‌లు స్థానిక ఎన్నికలపై కోర్టును ఆశ్రయించారు. స్థానిక ఎన్నికలైనా నిర్వహించండి.. లేదా పాత సర్పంచులనైనా కొనసాగించాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కోర్టు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఆరు నెలల తర్వాత బెంచ్ మీదకు..
ఇటు ప్రభుత్వం తరఫున న్యాయవాదులు, అటు మాజీ సర్పంచ్‌లు న్యాయవాదులు బలంగా వాదనలు వినిపించారు. దీంతో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో తేల్చిచెప్పాలని ప్రభుత్వాన్ని కోరింది. జాప్యం జరగడానికి కారణాలు తెలపాలని, డిసెంబర్ 23 వరకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ క్రమంలో చీఫ్ జస్టిస్ ముందుకు బీసీ కమిషన్, రిజర్వేషన్ ప్రక్రియకు సంబంధించిన కేసు రావడంతో మాజీ సర్పంచ్ లు వేసిన కేసుపై కదలిక రాలేదు. ఆరు నెలల తర్వాత మాజీ సర్పంచ్‌లు కేసు బెంచ్ మీదకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే కోర్టు అన్ని వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసింది.
ఎన్నికలకు సన్నద్ధమవుతున్న సర్కార్
స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సమయాత్తమవుతున్నది. ఇప్పటికే పంచాయతీరాజ్ అధికా…ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల లెక్కతేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ ప్రక్రియ తుది దశకు చేరుకున్నది. గతంతో పోలిస్తే ఈ సారి ఎంపీటీసీ స్థానాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. రిజర్వేషన్ల అంశంపై కూడా ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ప్రభుత్వానికి అనుకూలంగా మారడంతో ఎన్నికల నిర్వహణకు ఇదే మంచి సమయమని భావిస్తున్నట్లు సమాచారం.