ద్విచక్ర వాహనాలకు టోల్ వసూలు… తప్పుడు ప్రచారం

No Toll fee for two W heelers:ద్విచక్ర వాహనాలకు హైవేలపై టోల్ వసూళ్ల పై జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఖండించారు. ఆయన ఎక్స్ వేదికగా వార్తలను ఖండించారు.‘కొన్ని మీడియా సంస్థలు ద్విచక్ర వాహనాలపై టోల్ వసూలు చేయనున్నట్లు తప్పుదారి పట్టించే వార్తలను వ్యాప్తి చేస్తున్నాయి. అలాంటి నిర్ణయం ఏది తీసుకోలేదు. ద్విచక్ర వాహనాలకు టోల్ పై పూర్తి మినహాయింపు కొనసాగుతుంది. నిజం తెలియకుండా తప్పుదారి పట్టించే వార్తలను వ్యాప్తి చేయడం ద్వారా సంచలనం సృష్టించడం ఆరోగ్యకరమైన జర్నలిజానికి సంకేతం కాదు. దీనిని నేను ఖండిస్తున్నాన’ని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. టోల్ ఫీజు వసూళ్లకు సంబంధించిన ఊహాగానాలు ప్రచారం చేయవద్దని, కేంద్రానికి ఆ ఆలోచన లేదని మంత్రి గడ్కరీ స్పష్టం చేశారు.
రహదారూలపై బైకుల సంఖ్య పెరగడంతో ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో ద్విచక్ర వాహనదారులు ఆందోళన చెందారు. ఈ నేపధ్యంలోనే కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పందించింది. అటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో పాటు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సైతం ఎక్స్ వేదికగా స్పష్టం చేసింది. టూ వీలర్స్కు టోల్ వసూలు ఫేక్ వార్తలని స్పష్టం చేసింది. బైక్లకు టోల్ చార్జీలు వసూలు చేయాలనే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది.