ఎనిమిది రోజులు… ఐదు దేశాలు..

PM Narendra Modi: ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ విదేశాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆయ‌న ఎనిమిది రోజులు… ఐదు దేశాల్లో ప‌ర్య‌టిస్తారు. ఆయ‌న‌ ఘనా, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో, అర్జెంటీనా, నమీబియా దేశాల్లో పర్యటించనున్నారు. బుధవారం ఆఫ్రికా దేశం ఘనా వెళ్తారు. ఆ దేశంలో భారత్‌ ప్రధాని పర్యటించడం మూడు దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి. మూడు దశాబ్దాల తర్వాత ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే ప్రథమం. వ్యవసాయం, వ్యాక్సిస్ డవలప్‌మెంట్, ఘనాలో వ్యాక్సిన్ హబ్ ఏర్పాటు, రక్షణ రంగంలో సహకారం వంటివి ప్రధానంగా చర్చిస్తారు.

3,4 తేదీల్లో ప్రధాని ట్రినిడాడ్‌-టొబాగోలో పర్యటించనున్నారు. 1999 తర్వాత ఈ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. 4నే అర్జెంటీనాకు వెళ్లనున్న ప్రధాని మోదీ… మరుసటిరోజూ అక్కడే ఉంటారు. రక్షణ, వ్యవసాయం, గనులు, చమురు, పునరుత్పాదక ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించే అంశంపై అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్‌ మిలేతో చర్చలు జరుపుతారు.

అనంతరం బ్రెజిల్‌ వెళ్తారు. ఆ దేశంలోని రియో డీ జనీరో వేదికగా 6-7 తేదీల్లో జరిగే బ్రిక్స్‌ 17వ సదస్సులో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో పహల్గాం దాడి ఘటనను బ్రిక్స్ 17వ సదస్సు ఖండించనుంది. భారత్‌ ప్రతిపాదన మేరకు ఒక తీర్మానం చేయనుంది. ప్రధాని 9న నమీబియాకు వెళ్లి… ద్వైపాక్షిక చర్చలతో పాల్గొనడంతోపాటు పార్లమెంటులోనూ ప్రధాని ప్రసంగిస్తారు. ఆ దేశ పార్లమెంటులోనూ ప్రసంగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత 11 ఏళ్లలో మోదీ సుదీర్ఘ దౌత్య పర్యటనల్లో ఇదొకటి కానుంది.

చివరగా ప్రధాని మోదీ నమీబియా చేరుకుంటారు. నరేంద్ర మోడీ నమీబియాలో పర్యటించే మూడో భారత ప్రధాని గా నిలువనున్నారు. మొత్తంగా ప్రధాని మంత్రి తన విదేశాంగ విధానంలో భాగంగా పలు దేశాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా ప్రధాని మంత్రి జీ 7 సమావేశాల్లో భాగంగా కెనడా దేశానికి వెళ్లారు. అంతకు ముందు సైప్రస్ తో పాటు క్రొయేషియా దేశాలకు వెళ్లారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like