ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో రాత పూర్వకంగా చెప్పండి
Devapur Orient Cement Elections: మీరు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో సోమవారం కోర్టుకు రాతపూర్వకంగా చెప్పాలని హైకోర్టు జడ్జి ఆదేశాలు జారీ చేశారు. మంచిర్యాల జిల్లా దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎన్నికలపై గురువారం విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని జడ్జి ప్రశ్నించారు. ఆగస్టు 14 వరకు ఎన్నికలు ఉంటాయని చెప్పడంతో… ఇదంతా కాదు తమకు సోమవారం వరకు లిఖిత పూర్వకంగా ఇవ్వాలంటూ ఆదేశించారు. అందులో ఎన్నికల షెడ్యూల్ సమర్పించాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. లేనిపక్షంలో ప్రిన్సిపల్ సెక్రటరీకి సమన్లు జారీ చేస్తానని న్యాయమూర్తి హెచ్చరించారు.