ఉగ్రవాదులు ఏడుస్తున్నరు… కాంగ్రెస్ ఏడుస్తోంది..
Modi lashed out at the Congress:ఉగ్రవాదులు ఏడుస్తున్నారు, వారి సూత్రధారులు ఏడుస్తున్నారు.. వారు ఏడుపు చూసి ఇక్కడ కూడా కొంతమంది ఏడుస్తున్నారని కాంగ్రెస్ పార్టీపై మోదీ విరుచుకుపడ్డారు. ఆపరేషన్ సింధూర్‌పై చర్చ సందర్భంగా ప్రధానమంత్రి పార్లమెంట్‌లో మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్‌కు ప్రపంచ దేశాలన్నీ భారత్‌కు మద్దతు తెలిపాయని కానీ, దేశంలోని కాంగ్రెస్ నుంచి మాత్రం మద్దతు లభించలేదన్నారు. పాకిస్తాన్‌కు కాంగ్రెస్ క్లీన్ చిట్ ఇవ్వడం చూసి దేశం ఆశ్చర్యపోతోందన్నారు.పహల్గామ్ దాడి చేసినవారు పాకిస్తాన్‌కు చెందిన వారేనా..? అని రుజువు అడుగుతున్నారని… పాకిస్తాన్ కూడా కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్ చేస్తుందని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
సర్జికల్ స్ట్రైక్ సమయంలో ఒక నాటకం ఆడటానికి ప్రయత్నించారు. అది పని చేయలేదు. వైమానిక దాడి సమయంలో వారు మరొక నాటకం ఆడటానికి ప్రయత్నించారు. అది కూడా పని చేయలేదు. ఆపరేషన్ సిందూర్ జరిగినప్పుడు వారు ఒక కొత్త వ్యూహాన్ని అనుసరించారు. ఆపరేషన్ సిందూర్ ఎందుకు ఆపేశారని అడుగుతున్నారు… వారు మమ్మల్ని వ్యతిరేకించడానికి ఏదో ఒక కారణం కావాలి. అందుకే నేను మాత్రమే కాదు, మొత్తం దేశం మిమ్మల్ని చూసి నవ్వుతోందని మోదీ దుయ్యబట్టారు.
ఒకవైపు భారతదేశం స్వావలంబన వైపు వేగంగా ముందుకు సాగుతోందని… కానీ కాంగ్రెస్ సమస్యల కోసం పాకిస్తాన్‌పై ఆధారపడుతోందని ఎద్దేవా చేశారు. దురదృష్టవశాత్తు పాకిస్తాన్ నుంచి అంశాలను కాంగ్రెస్ దిగుమతి చేసుకుంటోందన్నారు. ఇంతకాలం దేశాన్ని పాలించిన వారు భారతదేశ రక్షణ, విదేశాంగ, హోం శాఖ మంత్రులను నమ్మకపోవడం దురదృష్టకమన్నారు మోదీ. కొందరు విపక్ష నేతలు పాకిస్తాన్ అధికార ప్రతినిధుల మాదిరిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.