గుండెపోటుతో తహసీల్దార్ మృతి
Tahsildar dies of heart attack: తహసీల్దార్ జ్యోతి ప్రియదర్శిని గుండెపోటుతో మరణించారు. మంచిర్యాల కలెక్టరేట్ ప్రాంతంలో ఆమె నివాసం ఉంటున్నారు. ఇంట్లో మంగళవారం రాత్రి పదిన్నర ప్రాంతంలో గుండెలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృత్యువాత పడ్డారు. జగిత్యాలకు చెందిన జ్యోతి ప్రియదర్శిని మంచిర్యాల జిల్లాలో పలు మండల్లాలో తహసీల్దార్‌గా విధులు నిర్వహించారు.