మాదారంలో మస్త్ మజా.. మహిళల సందడి

-ఆటలు, పాటలు, నృత్యాలతో మహిళల ఉత్సాహం
-మహిళలకు వేదికగా మస్త్ మజా

తాండూర్ మండలం సింగరేణి పరిధిలోని మాదారం టౌన్షిప్ కమ్యూనిటీ హాల్లో శనివారం మహిళల కోసం ఓ ఛాన‌ల్ నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో మ‌హిళ‌లు సంద‌డి చేశారు. “మస్త్ మజా” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటలు, పాటలు, నృత్యాలు, కోలాటాలతో మహిళలతో సంద‌డి సంద‌డిగా కొన‌సాగింది. పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించిన మహిళలు, విజేతలుగా నిలిచి బహుమతులు అందుకున్నారు. మాదారం టౌన్షిప్ మహిళలు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా ఆస్వాదించారని, మహిళల జీవితంలో చిరస్మరణీయంగా నిలిచిపోనుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ప్రొడ్యూసర్ గీత, ప్రోగ్రాం అసిస్టెంట్ శ్రీనివాస్, జె.ఎస్.కుమారి, యాంకర్ వినీల్, ఆడియో విభాగం నుంచి కృష్ణమూర్తి, జయప్రసాద్, కెమెరామెన్లు వంశీకృష్ణ, ఉదయ్, అహ్మద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like