మీ మంత్రి… ఎమ్మెల్యే ఏం పీకలేరు..
నువ్వు మీ మంత్రి… ఎమ్మెల్యే ఏం పీకలేరు.. నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో..? జీఎంకి చెప్తావా చెప్పుకో..? తనను ఓ ఫోర్‌మెన్ తింటారని బెల్లంపల్లి మాజీ కౌన్సిలర్ ఒకరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సింగరేణి విద్యుత్ లైన్లకు సంబంధించి మాట్లాడేందుకు వెళ్లిన తనను ఇష్టం వచ్చినట్లు అన్నాడని.. బూతులు సైతం తిట్టాడని బెల్లంపల్లి 23 వార్డు మాజీ కౌన్సిలర్ గుజ్జరవి ఆరోపించారు.
బెల్లంపల్లి స్టేషన్ రోడ్డు కాలనీలో సింగరేణి సంస్థ విద్యుత్ లైన్ ఉంది. దీని నిర్వహణ సింగరేణి చూసుకుంటోంది. కొన్ని సంవత్సరాల నుండి సరైన నిర్వహణ చేయడం లేదు. సింగరేణి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. గత ఏడాది ప్రజా దర్బార్‌లో సింగరేణి సంస్థ జనరల్ మేనేజర్ మందమర్రికి వీధి దీపాల కోసం దరఖాస్తు ఇచ్చారు. పది నెలలు గడిచినా దీనిపై చర్యలు శూన్యం. దీంతో మళ్లీ ఎమ్మెల్యే వినోద్ దృష్టికి తీసుకువెళ్లారు. MLA PA ఈ విషయంలో సింగరేణి సూపర్ వైజర్ ను అడిగారు. దీంతో బెల్లంపల్లి వర్క్ షాప్ ఎలక్ట్రికల్ ఫోర్‌మెన్ గా విధులు నిర్వహిస్తున్న పిల్లి శ్రీనివాస్ తనకు ఫోన్ చేసి నన్ను వర్క్ షాప్ రమ్మని పిలిచారని గుజ్జ రవి తెలిపారు.
బెల్లంపల్లి ఎలక్ట్రికల్ వర్క్ షాప్ వెళ్లానని ఎలక్ట్రికల్ ఫోర్ మెన్ పిల్లి శ్రీనివాస్ నువ్వు నా మీద MLA కు ఫిర్యాదు చేశావ్ కదా… అని ఇష్టం వచ్చినట్లు తిట్టారని గుజ్జ రవి వెల్లడించారు. అసభ్యకరమైన పదజాలంతో తిడుతూ.. నువ్వు నీ ఎమ్మెల్యే మీ మంత్రులు నన్ను ఏమి పీకలేరు. నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని దుర్భాషలాడారని వెల్లడించారు. జీఎం కి చెప్తావా చెప్పుకో.. నన్ను ట్రాన్‌ఫర్ చేయించగలరమో అంతే.. అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వార్డుకు ప్రథమ పౌరుడైన నన్ను నోటికి ఎంత వస్తే అంత తిట్టాడని మాజీ కౌన్సిలర్ ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి ఫోర్‌మెన్ పిల్లి శ్రీనివాస్ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోగలరని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.