బీజేపీ నేత‌ల అరెస్టు

BJP leaders arrested: బీజేపీ నేత‌లు, కార్పొరేట్ల‌ర‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ పార్టీ జీహెచ్ఎంసీలో స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి స‌చివాల‌యం ముట్ట‌డికి పిలుపునిచ్చింది. ఈ నేప‌థ్యంలోనే ప‌లువురు బీజేపీ నేత‌ల‌ను హౌస్‌ అరెస్టు చేశారు. కొంద‌రిని ముంద‌స్తుగా అదుపులోకి తీసుకోగా మ‌రికొంద‌రు స‌చివాల‌యం ముట్ట‌డికి వెళ్తుండ‌గా అరెస్టు చేశారు. కార్పొరేట‌ర్ శ్రీ‌వాణిని సెక్రటేరియట్ వద్ద అరెస్ట్ చేశారు. సరూర్నగర్ బిజెపి కార్యకర్తలతో సహా సెక్రటేరియట్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు నుంచి సెక్రటేరియట్ గేటు లోకి వెళ్లే తరుణంలో పోలీస్ బలగాలు అరెస్టు చేశారు.

You might also like