ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఏకగ్రీవం
Adilabad:జర్నలిస్టులు ఐక్యంగా ఉంటూ సమాజ అభివృద్ధికి తోడ్పడాలని ట్రైనీ కలెక్టర్ సలోని చాబ్రా అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారూ. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ మీడియా ప్రజాసమస్యలను వెలుగులోకి తెస్తుందన్నారు. ప్రెస్ క్లబ్ అభివృద్ధికి నూతన కార్యవర్గం పాటు పడాలని అన్నారు. జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
ఆదిలాబాద్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా అన్నొజుల శ్రీనివాస్, దత్తాత్రి, కోశాధికారిగా అవునూరి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా కిరణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా ఏ.నవీన్ కుమార్ సహాయ ఎన్నికల అధికారిగా సంజయ్ పాల్గొనగా, టీయూడబ్ల్యూజే (హెచ్ 143) జిల్లా అధ్యక్షులు బేత రమేష్, ప్రధాన కార్యదర్శి ఎల్ రాజు, నాయకులు ప్రేమ్ సాగర్, ఎస్ ప్రవీణ్, అభినందనలు తెలిపి ఘనంగా సన్మానించారు.
నూతన అధ్యక్షుడు అన్నొజుల శ్రీనివాస్ మాట్లాడుతూ… ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు. రానున్న రోజుల్లో క్లబ్ ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ఎన్నో ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న ఇండ్ల స్థలాల కేటాయింపుకు కృషి చేస్తామని తెలిపారు.