504 మందిని రక్షించిన బృందాలు

Medak,kamareddy floods:మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలకు జనజీవనం అతలాకుఅతం అవుతోంది. రెండు జిల్లాలలో పరిస్థితి దారుణంగా ఉంది. ఎక్కడిక్కడ వరదల్లో జనం చిక్కుకుపోగా సహాయక బృందాలు వారిని సురక్షితంగా బయటకు తీసుకుని వస్తున్నారు. ఈ రెండు జిల్లాలలో దాదాపు 504 మందిని కాపాడారు.

–కామారెడ్డి జిల్లా కళ్యాణి ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్లో చిక్కుకున్న 9 మందిని రాష్ట్ర విపత్తు స్పందనా దళం నిజామాబాద్ బృందం సురక్షితంగా తీసుకువచ్చారు. జిల్లాలోని గుంగల్ గ్రామం వద్ద బాన్స్వాడ్ అగ్నిమాపక సిబ్బంది మరో వ్యక్తిని వరద నీటి నుంచి రక్షించారు.

–కామారెడ్డి పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాలకు హౌసింగ్ బోర్డ్ కాలనీ పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నది. కామారెడ్డి పట్టణ పోలీసులు రెస్క్యూ చేసి 60 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

–గుంకుల్ గ్రామ శివారులోని నిజం సాగర్ మంజీరా వాగులో చిక్కుకున్న 5మందిని ఫైర్ టీం సహాయంతో సకాలంలో చర్యలు తీసుకుని సురక్షితంగా రక్షించామని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు.

–నర్వ-అన్నాసాగర్ మార్గంలో వరదల్లో చిక్కుకున్న 9 మందిని సహాయక బృందం సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఆపరేషను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.

–మెదక్ జిల్లా రామాయంపేట లో 350 మంది ఎస్సీ ఉమెన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థినులు వరద నీళ్ళలో నుంచి తాళ్ళ సాయంతో బయటకు తీసుకువచ్చారు.

ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ హాస్టళ్లలో ఉన్న 80. మందిని సైతం అదేవిధంగా తీసుకువచ్చారు.

కామారెడ్డి జిల్లాలోని పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ను ఆదేశించారు. పరిస్థితులకు అనుగుణంగా ఎన్డీఆర్ఎఫ్, ఎల్డీఆర్ఎఫ్ బృందాల సాయం తీసుకోవాలన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like