తీన్మార్‌ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ

Teenmar Mallanna’s new political party: ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. తన పార్టీకి ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ అని పేరు పెట్టినట్లు ప్రకటించారు. తాజ్‌కృష్ణ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్త రాజకీయ పార్టీ పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా తీన్మార్‌ మల్లన్న మాట్లాడుతూ.. సెప్టెంబర్‌ 17వ తేదీ బీసీల తలరాత మారే దినంగా తాను భావిస్తున్నానన్నారు. తెలంగాణలో మెజార్టీ సంఖ్యలో ఉన్న బీసీలకు రాజకీయ పార్టీ అవసరం ఉందన్న ఉద్దేశంతో పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

You might also like