బ్రేకింగ్ .. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి
మాజీ ముఖ్యమంత్రి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు రోశయ్య మరణించారు. తీవ్ర అనారోగ్యానికి గురైన మాజీ ముఖ్య మంత్రి రోశయ్య ఇవాళ ఉదయం మరణించారు. 88 సంవత్సరాలు ఉన్న మాజీ ముఖ్యమంత్రి రోశయ్య… ఆరోగ్యం విషమించి… తుదిశ్వాస విడిచారు. ఇవాళ ఉదయం ఒక్క సారి గా బీపీ డౌన్ కావడం తో రోశయ్యను ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ లోని స్టార్ ఆస్పత్రికి రోశయ్యను తరలించారు కుటుంబ సభ్యులు. అయితే…. ఆస్పత్రికి వెళ్లగానే రోశయ్య చనిపోయినట్లుగా నిర్ధారించారు వైద్యులు.
ఇంటి దగ్గర నుంచి ఆస్పత్రి కి మార్గమధ్యంలోనే రోశయ్య మృతి చెందారని తెలుస్తోంది. దీంతో రోశయ్య పార్థివ దేహాన్ని ఇంటికి తీసుకువస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గా రోశయ్య ఏడాదిన్నర కాలం పాటు పనిచేసిన సంగతి తెలిసిందే.