ప్రపంచాన్ని గెలిచిన ఇండియన్ విస్కీ
Best World Whisky Indri:ప్రపంచ విస్కీ విభాగంలో భారతీయ విస్కీలు ఆధిపత్యం చెలాయించాయి. లాస్ వెగాస్ గ్లోబల్ స్పిరిట్ అవార్డ్స్-2025లో “బెస్ట్ వరల్డ్ విస్కీ”గా మన దేశానికి చెందిన ఇంద్రి (Indri) అవార్డు సాధించింది. లాస్ వెగాస్ గ్లోబల్ స్పిరిట్స్ అవార్డ్స్ 2025లో ప్రపంచ విస్కీ విభాగంలో ఐదు విస్కీలు ఫైనల్స్ చేరుకున్నాయి. ఐదింటిలో నాలుగు కైవసం చేసుకుని భారతీయ విస్కీలు ఆధిపత్యం చెలాయించాయి. ఇందులో 99.1 పాయింట్లతో దాదాపు ఫుల్ స్కోరుతో ప్రపంచ బెస్ట్ విస్కీగా అగ్రశ్రేణి గౌరవం పొందింది ఇంద్రి.
లాస్ వెగాస్ గ్లోబల్ స్పిరిట్స్ అవార్డ్స్ అనేది అమెరికాలో విస్కీ పరిశ్రమ నిర్వహించే పోటీ. అనుభవజ్ఞులైన న్యాయనిర్ణేతల బృందం పూర్తిగా బ్లైండ్ టేస్టింగ్ ద్వారా స్పిరిట్ అంచనా వేస్తారు. ఈ పోటీలో 100 పాయింట్లను ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ పోటీల్లో గెలిచిన వారికి ప్లాటినం, గోల్డ్, సిల్వర్, కాంస్య పతకాలు ఉంటాయి. ఈ పోటీల్లో టాప్ లో నిలిచిన ఇంద్రీ.. హిమాలయ పర్వత ప్రాంతాలకు సమీపంలోని హర్యానాలోని ఇంద్రీలోని పికాడిలీ డిస్టిలరీస్ సాంప్రదాయ రాగి కుండ స్టిల్స్ ఉపయోగించి భారతీయ ఆరు వరుసల బార్లీ నుండి దీన్ని తయారు చేస్తుంది.
ఈ బ్రాండ్ 2021లో ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించారు. ఈ విస్కీలో క్యాండీడ్ ఆరెంజ్, ఆప్రికాట్, బంగారు రంగు ఎండుద్రాక్ష, హనీ, వెనిల్లా, రుచికర ఓక్ సువాసనలు ఉంటాయి. ఇది తియ్యగా, మృదువుగా, రుచికరంగా ఉంటుంది. ఎండిన పండ్లు, మార్మాలాడే, టోఫీ, కాల్చిన గింజలు, రుచికోసం చేసిన టానిక్ ఓక్, అలాగే బేకింగ్ కోకో సూచనలను ప్రదర్శిస్తుంది. ఫినిషింగ్ తీపిగా, స్పైసీగా ఉంటుంది. ఈ విస్కీ “బెస్ట్ ఇండియన్ సింగిల్ మాల్ట్” మరియు “బెస్ట్ ఇండియన్ విస్కీ”గా అవార్డులను సొంతం చేసుకుంది. ఇది దేవన్స్ మోడరన్ బ్రూవరీస్ నుండి వచ్చిన ఒక సింగిల్ మాల్ట్. అమృత్ డిస్టిలరీస్ (Amrut Distilleries) వంటి అనేక భారతీయ బ్రాండ్లు లండన్ స్పిరిట్స్ కాంపిటీషన్ వంటి అంతర్జాతీయ వేదికలలో గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నాయి. గ్లోబల్ స్పిరిట్స్ మార్కెట్‌లో భారతీయ విస్కీల ప్రాముఖ్యత పెరుగుతోందని పలువురు నిపుణులు చెబుతున్నారు.