రెండు కంటైనర్ల ఢీ.. భారీగా ఎగసిపడుతున్న మంటలు
Road Accident:జాతీయ రహదారిపై జరిగిన ఓ ప్రమాదంలో రెండు కంటైనర్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ కంటైనర్ నుంచి భారీగా మంటలు వెలువడుతుండటంతో అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
44 వ నంబర్ జాతీయ రహదారి పై ప్రమాదం సంభవించింది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతా గోంది వద్ద రెండు కంటైనర్లు ఢీ కొన్నాయి. ముందు వెళ్తున్న కంటైనర్ ను మరో కంటైనర్ ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. దీంతో ఒక కంటైనర్లో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. దీంతో అక్కడ ఉన్న కొందరు ప్రయాణీకులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.