అదే మట్టిలో కలిసిపోతరు…
Former MP Venkatesh Neta:కాంగ్రెస్ నాయకులు గుండాయిజం, రౌడీయిజం చేయాలనుకుంటే అది తాత్కాలికం మాత్రమే. అదే మట్టిలో మీరు కూడా కలిసిపోతారని మాజీ ఎంపీ వెంకటేష్ నేత అన్నారు. ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏట మధూకర్ ఆత్మహత్య తనను కలిచివేసిందన్నారు. ఎన్నికల్లో గెలవాలంటే డబ్బులు, బెదిరింపులు కాదని గుర్తు చేశారు. ప్రజలకు మంచి చేయాలని సూచించారు. ఎన్నికలు వస్తుంటాయి… పోతుంటాయి గెలుపు ఓటములు సహజమని వెంకటేష్ నేత స్పష్టం చేశారు. కేవలం ఎన్నికల్లో మాత్రమే యుద్ధం చేయాలన్నారు. ఎన్నికలు అయ్యాక గ్రామంలో ఉన్న నాయకులు అంతా కలిసికట్టుగా పని చేయాలని హితవు పలికారు. మధూకర్ ఆత్మహత్యకు కాంగ్రెస్ నాయకులు కారకులైతే శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకుల్లారా ఖబర్దార్ అధికారం శాశ్వతం కాదు ప్రజాక్షేత్రంలో ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రజల మనన్నలు పొందండి. ప్రజాక్షేత్రంలో గెలవండి. అప్పుడు ప్రజల మన్ననలు పొందండంటూ వెంకటేష్ నేత కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేశారు.
పోలీసుల నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యం ఉందని నేతలు తన దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. యూనిఫాం సర్వీస్‌లో ఉన్నప్పుడు ప్రజలకు న్యాయం అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రజలకు మంచి చేయాలని అన్నారు. మధూకర్ ఆత్మహత్యలో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ నేరంలో భాగస్వామ్యులు అయిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఏదైనా ఉంటే అందరం కలిసి పోరాటం చేద్దామన్నారు. సమస్యలు ఏదైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.