ఆయుధాలు వదిలేసిన అగ్రనేత మల్లోజుల
-మావోయిస్టు పార్టీ చరిత్రలోనే సంచలనం
-మహారాష్ట్ర పోలీసుల ఎదుట లొంగుబాటు
-ఆయనతో పాటు 60 మంది పార్టీ సభ్యులు కూడా
Mallojula Venugopal Rao:మావోయిస్ట్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో సీపీఐ మావోయిస్ట్ పొలిట్ బ్యూరో సభ్యుడు, మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోనూ అలియాస్ భూపతి 60 మంది మావోయిస్టు కార్యకర్తలతో కలిసి ఆయుధాలు విడిచిపెట్టారు. 1970లో మల్లోజుల నక్సలైట్లలో చేరారు. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వర్‌రావు అలియాస్ కిషన్ జీకి ఈయన తమ్ముడు. పార్టీ విధివిధానాల రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన మల్లోజుల తలపై ఆరు కోట్లకు పైగా నజరానా ఉంది. ఇటీవలే కాల్పుల విరమణ, శాంతి చర్చల పేరుతో ఈయన అభయ్ పేరుతో కరపత్రాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై మావోయిస్టు పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
మల్లోజుల వేణుగోపాల్ రావు లొంగుబాటు ఛత్తీస్‌గఢ్ ఉపముఖ్యమంత్రి విజయ్‌శర్మ ధ్రువీకరించారు. మావోయిస్టు నేతలు జనజీవన స్రవంతిలో కలవడాన్ని స్వాగతిస్తున్నామని, అలా చేయకుంటే సాయుధ దళాలు సరైన పద్ధతిలో జవాబిస్తాయని విజయ్‌శర్మ పేర్కొన్నారు. నక్సలిజం అంతం కావాలని బస్తర్ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారని వివరించారుకాగా 2026 మార్చి 31 నాటికి మవోయిస్టులను తుది ముట్టిస్తామని అమిత్‌షా ఇదివరకే ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్ర ప్రభుత్వాల నాయకత్వంలో దేశవ్యాప్తంగా అందులో భాగంగా ఆపరేషన్ కగార్‌ను ముమ్మరం చేశారు. సెప్టెంబర్‌లో సోను ఆయుధాలు విడిచిపెట్టడాన్ని సూచిస్తూ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఛత్తీస్‌గఢ్, దేశంలోని ఇతర ప్రాంతాలలోని మావోయిస్టు కార్యకర్తల నుంచి అతనికి మద్దతు లభించింది.