చెంప ప‌గులుద్ది… బ‌ట్ట‌లూడ‌దీసి కొడ‌తా..

ఇద్ద‌రు బీజేపీ నేత‌లు.. ఇద్ద‌రూ పార్ల‌మెంట్ స్థాయి నేత‌లే.. కానీ ఒక‌రికి కోప‌మొచ్చింది… మ‌రో నేత‌కు చెంప ప‌గులుద్ది అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చాడు.. అది కూడా రాష్ట్ర అధ్య‌క్షుడు ముందు… ఇంతకీ ఏం జ‌రిగిందంటే…

వేమ‌న‌ప‌ల్లి మండ‌లం నీల్వాయిలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఏట మ‌ధూక‌ర్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు వ‌చ్చారు. ఆయ‌న ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా బీజేపీ పెద్ద‌ప‌ల్లి పార్ల‌మెంట్ ఇన్‌చార్జీ గోమాస శ్రీ‌నివాస్… మాజీ ఎంపీ వెంక‌టేష్ నేత‌ను అరేయ్ వెంక‌టేష్ అంటూ సంబోధించారు. దీంతో వెంట‌నే స్పందించిన వెంక‌టేష్ నేత అరేయ్ అంటే చెంప ప‌గులుద్ది అంటూ సీరియ‌స్ అయ్యారు. దానికి గోమాస శ్రీ‌నివాస్ బట్ట‌లు ఊడ‌దీసి కొడ‌తా అంటూ వెంక‌టేష్ నేత‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఒక‌నొక‌ద‌శ‌లో కూర్చుని ఉన్న వెంక‌టేష్ నేత గోమాస శ్రీ‌నివాస్ వైపు వెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. అంద‌రూ క‌లిసి ఆయ‌న భుజాల‌పై చేయి కూర్చోబెట్టారు. ఇదంతా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు ముందే జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం.

Get real time updates directly on you device, subscribe now.

You might also like