కోతులను తరిమేందుకు కొండముచ్చు ఫ్లెక్సీలు
కోతులను తరిమేందుకు ఆ గ్రామస్తులు ఓ సూపర్ ఐడియా అనుసరిస్తున్నారు. గ్రామాల్లో కోతుల బెదడ… అవి చేసే అల్లరి ఇంతా అంతా కాదు… ఒకేసారి గుంపులకు గుంపులుగా ఇళ్లలోకి వెళ్లి చేతికి దొరికిన వస్తువులను తీసుకెళుతున్నాయి. ఎవరైనా వాటిని వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తే వారిపై దాడి చేస్తున్నాయి. కొన్ని చోట్ల జనాలపై దాడులు సైతం కరిచాయి కూడా….
తాండూరు మండలం మాదారం టౌన్షిప్లో కోతుల బెడద విపరీతంగా తయారయ్యింది. దాదాపు రెండేళ్లుగా ఈ కోతులతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. కోతులు కొండెంగలను (కొండముచ్చులు) చూసి భయపడతాయి. దీంతో మాదారం టౌన్షిప్కు చెందిన కాంగ్రెస్ నేత సూరం రవీందర్ గ్రామంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. సింగరేణి పార్క్, సెంటర్లో పలు చోట్ల ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రోజురోజుకు పెరుగుతున్న కోతుల బెడద నుంచి ఉపశమనం పొందేందుకు కోతులు భయపడే విధంగా వివిధ భంగిమలో ఉన్న కొండెంగల ఫొటోలున్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
ఈ రోజు ఆ కొండెంగల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ప్రాంతంలో కోతులు భయపడి పారిపోయాయని ప్రజలు చెబుతున్నారు. కొందరైతే ఈ కొండెగల ఫ్లెక్సీలు చూసి ఆశ్చర్యపోతున్నారు. కుక్కలున్నాయి.. జాగ్రత్త అనే బోర్డులు చూశాం కానీ, ఇక్కడ కొండెంగల ఫొటోలు ఏర్పాటు చేయడం ఇక్కడే చూస్తున్నామంటున్నారు.