బీసీ ర్యాలీలో కింద పడిన వీహెచ్
V. Hanumantha Rao:బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటూ బీసీ సంఘాలు, వివిధ పార్టీల నాయకులు శనివారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ అంబర్‌పేటలో అఖిలపక్ష నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, సీనియర్ నేత వీ. హనుమంత రావు, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, సీపీఐ, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. బ్యానర్ పట్టుకుని హనుమంత రావు ర్యాలీ ముందు వరుసలో నడుస్తున్నారు. సహచర నాయకులతో కలిసి బ్యానర్ పట్టుకుని ముందు నడుస్తుండగా.. బ్యానర్ కాలి కింద పడటంతో వీహెచ్ అకస్మాత్తుగా ముందుకు తూలిపోయి రోడ్డుపై పడిపోయాడు. ఆయన అకస్మాత్తుగా కిండపడిపోవడంతో అక్కడున్న వారంతా కంగారుపడి ఆయనను వెంటనే పైకి లేపి సపర్యలు చేశారు.