కోడలిని గొడ్డలితో నరికి చంపిన మామ
Uncle hacks daughter-in-law to death with axe:కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన కొడుకు తనకు ఇష్టం లేని పెండ్లి చేసుకున్నాడని ఏకంగా గర్భిణీ అయిన కోడలిని గొడ్డలితో దారుణంగా నరికి చంపాడో వ్యక్తి…
కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని దహెగాం మండలం గిరవెళ్లి (గెర్రే) గ్రామానికి చెందిన రాణి అనే యువతి అదే గ్రామానికి చెందిన శివార్ల శేఖర్ అనే యువకున్ని ప్రేమించింది. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. కులాంతర వివాహం ఇష్టం లేని తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. అయినప్పటికీ ప్రేమించిన యువతినే పెళ్లి చేసుకుని తన ఇంట్లోనే కాపురం పెట్టాడు. తండ్రి వ్యతిరేకించినా అర్థం చేసుకుంటారని ఇద్దరు దంపతులు భావించారు.
రాణి ఇటీవలే గర్భం దాల్చింది. కానీ, కులాంతర వివాహం ఇష్టం లేని తండ్రి శివార్ల సత్తయ్య. ఎవరూ లేని సమయం చూసి నిండు చూలాలిని చంపేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమంయలో కోడలు ఎనిమిది నెలల గర్భవతి అయిన రాణి (23)ని గొడ్డలితో నరికి హత్య చేశాడు. దీంతో చుట్టుపక్కల వారు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.