రియాజ్.. ఎన్‌కౌంటర్
Rowdysheeter Riyaz Encounter:నిజామాబాద్‌లో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్‌ను హత్య చేసిన నిందితుడు.. రౌడీషీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకోగా.. అతనికి బీబీహెచ్‌లో చికిత్స అందిస్తుండగా ఉదయం బాత్‌రూంకు వెళ్తానని చెప్పిన రియాజ్ పోలీసుల వద్ద ఉన్న గన్ లాక్కుని దాడి చేసేందుకు ప్రయత్నించగా, పక్కనే ఉన్న మరో పోలీస్ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రియాజ్ అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు.
రియాజ్ శుక్రవారం పలు కేసుల్లో నిందితుడైన రియాజ్‌ను బైక్ దొంగతనం కేసులో అరెస్టు చేసిన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ద్విచక్రవాహనంపై అతడిని పోలీసుస్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశాడు. కానీ, మార్గమధ్యలో ప్రమోద్‌ను పొడిచి చంపి రియాజ్ పరారయ్యాడు. అప్పట్నించి రియాజ్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అతన్ని పోలీసులు ఆదివారం మధ్యాహ్నం పట్టుకున్నారు. అయితే, తనని వెంబడిస్తున్న పోలీసుల నుంచి తప్పించుకునేందుకు రియాజ్ తీవ్రంగా ప్రయత్నించాడు. పోలీసుల నుంచి పారిపోతున్న తనని అడ్డుకోబోయిన ఓ యువకుడిపై కత్తితో దాడి కూడా చేశాడు. సారంగపూర్ కెనాల్ శివారులోని పొలాల్లో రియాజ్ దాక్కొని ఉన్నాడనే సమాచారంతో శనివారం రాత్రి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన రియాజ్.. వారికి చిక్కకుండా ఉండేందుకు రాత్రంతా ఓ పాడైన లారీ క్యాబిన్‌లో దాక్కున్నాడు. ఎంత వెతికినా రాత్రి జాడ తెలియకపోవడంతో ఆదివారం ఉదయం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు.
పోలీసులు తనని సమీపిస్తున్న విషయాన్ని గమనించిన రియాజ్ లారీ క్యాబిన్‌లో నుంచి దూకి పరుగులు తీశాడు. రహదారిపైకి వచ్చి అటుగా వచ్చిన ఆసిఫ్ అనే ద్విచక్రవాహనదారుడిని లిఫ్ట్ అడిగి అతడితో కొద్ది దూరం వెళ్లారు. గమనించిన పోలీసులు కేకలు వేయడంతో బైక్ ఆపేసిన ఆసీఫ్.. రియాజ్‌ను పట్టుకునేందుకు యత్నించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య పెనుగులాట జరగ్గా.. ఆసి్‌ఫపై కత్తితో దాడి చేసిన రియాజ్ తీవ్రంగా గాయపరిచాడు. పెనుగులాటలో రియాజ్ కూడా పడిపోగా అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. రియాజ్‌తోపాటు ఆసిఫ్‌ను సైతం ఆస్పత్రికి తరలించారు.
ఈ రోజు ఉదయం కోర్టుకు తరలించాలని పోలీసులు రిమాండ్ రిపోర్టు సిద్దం చేశారు. ఈ నేపథ్యంలోనే వెపన్ తీసుకుని మరోసారి పోలీసులపై దాడికి ప్రయత్నించడం.. ఎన్‌కౌంటర్‌లో మృత్యువాతపడ్డాడు. ఆసుపత్రికి పోలీస్ కమిషనర్ సాయిచైతన్య చేరుకున్నారు. కాసేపట్లో ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.