భర్త కుట్టిన జాకెట్ నచ్చలేదని…
ఆత్మహత్య చేసుకున్న వివాహిత
హైదరాబాద్ – ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న చిన్న విషయాలకే తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తన భర్త కుట్టిన జాకెట్ నచ్చలేదని.. ఏకంగా ప్రాణాలు తీసుకుందో ఓ మహిళ. హైదరాబాద్‌లోని గోల్నాక తిరుమలనగర్‌లో శ్రీనివాసులు, విజయలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. శ్రీనివాసులు కాలనీల్లో తిరుగుతూ చీరలు విక్రయిస్తుంటాడు. అంతేకాకుండా ఇంట్లో టైలర్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఓ రోజు విజయలక్ష్మికి ప్రేమగా జాకెట్ కుట్టాడు. అది నచ్చలేదని భార్య చెప్పడంతో శ్రీనివాస్‌కు, విజయలక్ష్మీకి మధ్య వాగ్వాదం చోటు చేసుంది. దీంతో విజయలక్ష్మి తీవ్ర మనస్థాపానికి గురైంది. భర్త ప్రవర్తనతో మనస్తాపం చెందిన విజయలక్ష్మి ఏ మాత్రం ఆలోచించకుండా ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
స్కూల్‌కి వెళ్లిన పిల్లలు ఇంటికి వచ్చి బెడ్రూమ్ డోర్ కొట్టారు. ఎంతకు డోర్ తీయకపోవడంతో శ్రీనివాసులు వచ్చి బలవంతంగా తలుపులు తీసి చూడగా అప్పటికే విజయలక్ష్మి మృతి చెందింది. స్థానికుల వెంటనే అంబర్ పేట పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.