ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు..
MLA Kokkirala Prem Sagar Rao: మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు(MLA Kokkirala Prem Sagar Rao) ఆరోగ్యంపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన పీఏ శ్రీధర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని.. ఎప్పటికప్పుడు నియోజకవర్గ అభివృద్ధిపై సంబంధిత అధికారులతో చర్చిస్తున్నారని పేర్కొన్నారు. బుధవారం కూడా పట్టణంలోని మార్కెట్ ఏరియాలో ట్రాఫిక్ వ్యవస్థపై పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు వెల్లడించారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని కాంగ్రెస్ వర్గాలు సైతం స్పష్టం చేశాయి. ఇలాంటి వార్తలను ప్రచారం చేయవద్దని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు.