కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… ప్రయాణికుల సజీవ దహనం

Road Accident:కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉలిందకొండ దగ్గర జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. మంటలు వ్యాపించగానే అప్రమత్తమైన 12 మంది ప్రయాణికులు బస్సు అద్దాలు పగులగొట్టుకుని కిందకు దూకేశారు. బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

బస్సు బైకును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలంలో మంటలు భారీగా వ్యాపించడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనలో దాదాపు 20 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like