మ‌ద్యం షాపుల‌కు ద‌ర‌ఖాస్తుల వెల్లువ‌

Huge applications for liquor shops: తెలంగాణ రాష్ట్రం(Telangana State)లో కొత్త‌గా మ‌ద్యం షాపుల కోసం భారీగా ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. 2,620 మద్యం దుకాణాలకు 95,285 వేల దరఖాస్తులు అందాయి. వాటి ద్వారా రూ.2,858 కోట్ల ఆదాయం సమకూరింది. దరఖాస్తుదారుల వినతి మేరకు ప్రభుత్వం గడువు గురవారం వరకు పొడిగించింది. ఈ నెల 27న డ్రా ద్వారా మద్యం దుకాణాల లైసెన్స్‌లను ఖరారు చేయనున్నారు. నిరుడు దాదాపు 1.32 లక్షల దరఖాస్తులు రాగా, రూ.2,641 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ సారి దరఖాస్తులు త‌క్కువ‌గానే వచ్చినా, దరఖాస్తు రుసుం పెంచడంతో ఎక్సైజ్‌ శాఖ రాబడి పెరిగింది. నిరుడితో పోలిస్తే ఈ ఏడాది రూ. 218 కోట్లు అదనంగా వచ్చినట్టు ఎక్సైజ్‌ వర్గాలు ప్రకటించాయి. గడువు పొడిగింపు తర్వాత దాదాపు 4,000 దరఖాస్తులు అదనంగా వచ్చినట్టు ఎక్సైజ్‌ అధికారులు వెల్లడించారు.

అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 29,430 దరఖాస్తులు రాగా, అత్యల్పంగా అదిలాబాద్‌ జిల్లాలో 4,013 దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. గత నెల 27న టెండర్‌ నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. ఏపీకి చెందిన మహిళా వ్యాపారులు అధిక మొత్తంలో దరఖాస్తులు స‌మ‌ర్పించారు. మద్యం దుకాణాల గడువు పొడిగింపును వ్యతిరేకిస్తూ వ్యాపారులు గురువారం హైకోర్టు ఆశ్రయించారు. నిర్దేశించిన గడువు ముగిసిన త ర్వాత ఏకపక్షంగా పొడిగించడంతో లాటరీ పద్ధతిలో ఎంపిక విధానం కావడంతో లైసెన్స్‌ ఖరారు ప్రక్రియ తారుమారు అవుతుందని వ్యాపారులు హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణకు స్వీకరించిన హైకోర్టు విచారణ వాయిదా వేసింది. ఈ నెల 27న జిల్లా క‌లెక్ట‌ర్లు, ద‌ర‌ఖాస్తుదారుల స‌మ‌క్షంలో డ్రా తీయ‌నున్న‌ట్లు ఎక్సైజ్‌శాఖ అధికారులు వెల్ల‌డించారు.

జిల్లాల వారీగా దరఖాస్తుల వివరాలు..

ఆదిలాబాద్ – 771
కొమురం భీమ్ ఆసిఫాబాద్ – 680
మంచిర్యాల – 1712
నిర్మల్ – 991
హైదరాబాద్ – 3201
సికింద్రాబాద్ – 3022
జగిత్యాల – 1966
కరీంనగర్ – 2730
పెద్దపల్లి – 1507
రాజన్న సిరిసిల్ల – 1381
ఖమ్మం – 4430
కొత్తగూడెం – 3922
జోగులాంబ గద్వాల – 774
మహబూబ్ న‌గ‌ర్ – 2487
నాగర్ క‌ర్నూల్ – 1518
వనపర్తిలో – 757
మెదక్ – 1420
సంగారెడ్డి – 4432
సిద్దిపేట్ – 2782
నల్లగొండ – 4906
సూర్యపేట్ – 2771
యాదాద్రి భువనగిరి – 2776
కామారెడ్డి – 1502
నిజామాబాద్ – 2786
మల్కాజిగిరి – 5168
మేడ్చల్ – 6063
సరూర్ నగర్ – 7845
శంషాబాద్ – 8536
వికారాబాద్ – 1808
జనగామ – 1697
జయశంకర్ భూపాల్ ప‌ల్లి – 1863
మహబూబాబాద్ – 1800
వరంగల్ రూరల్ – 1958
వరంగల్ అర్బన్ – 3175

మొత్తంగా 95,285 దరఖాస్తులు వచ్చాయి.

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like