ఏసీబీ వలలో జిల్లా సహకార శాఖ అధికారి
ACB Trap: లంచం తీసుకుంటూ ఓ జిల్లా అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. జిల్లా సహకార శాఖ అధికారి రాథోడ్ బిక్కు నాయక్ ను ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఇక్బాల్ అహ్మద్ నగర్ లోని నివాసంలో రెండు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డాడు ఆయన.. సస్పెండ్ అయిన ఉద్యోగికి సంబంధించి పెరిగిన వేతనాలు మంజూరు చేసే విషయంలో లంచం డిమాండ్ చేశాడు. దీనికి సంబంధించి 7లక్షలు లంచం డిమాండ్ చేసిన బిక్కు నాయక్… మొదటి విడత 2 లక్షల రూపాయలు ఇచ్చే ఒప్పందం చేసుకున్నాడు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఏసీబీ అధికారులు ఆయనను వలపన్ని పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా కలక్టరేట్‌లో లోని జిల్లా సహకార అధికారి కార్యాలయంలో ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు.