ప్రజల చూపు.. బీజేపీ వైపు..
BJP:దేశ ప్రయోజనాల కోసం మోదీ గారి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, వారి చూపు ఇప్పుడు బీజేపే వైపు ఉందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ అన్నారు. ఆదివారం కాసిపేట మండలం నుండి పలువురు యువకులు బీజేపీ పార్టీలో చేరారు. వారికి వెరబెల్లి రఘునాథ్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనకు ఆకర్షితులై యువత పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పడు వచ్చిన గెలిచేది బీజేపీ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు.