బుగ్గ దేవాల‌యంలో భ‌క్తుల ప్ర‌త్యేక పూజ‌లు

కార్తీక మాస సోమవారం సందర్భంగా తాండూరు మండ‌లం బుగ్గ రాజ‌రాజేశ్వ‌ర స్వామి ఆల‌యంలో భ‌క్తులు పెద్ద ఎత్తున ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా స్వామి వారికి ప్ర‌త్యేక పూజలు నిర్వహించారు. దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు రాజ‌రాజేశ్వరస్వామికి అభిషేకాలు చేశారు. మహిళలు ఆలయం చుట్టూ దీపాలు వెలిగించారు. కార్తీక మాస శోభను సంతరించుకున్న బుగ్గ దేవాల‌యం శివ నామస్మరణతో మార్మోగింది. ఉదయం నుండి భక్తులు ధర్మ గుండంలో పుణ్యస్థానాలు ఆచరించి,స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like