ఒకే మ‌హిళ‌కు ద‌క్కిన రెండు షాపులు

Tenders for liquor shops in Telangana:కొంద‌రు ఎంత చేసినా… ఎన్ని చేసినా… క‌లిసి రాదు.. కానీ కొంద‌రికి మాత్రం అదృష్టం ఎలా త‌లుపు త‌డుతుందో తెలియ‌దు.. తెలంగాణ‌లో మద్యం దుకాణాల టెండర్లు ద‌క్కించుకునే పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నాలు చేశారు. కొంద‌రు ప‌దుల సంఖ్య‌లో ద‌ర‌ఖాస్తులు చేసుకున్నారు. మ‌రికొంద‌రు లాబీగా ఏర్ప‌డి ప‌ది మంది క‌లిసి షాపుల‌కు ద‌ర‌ఖాస్తులు చేసుకున్నారు. చాలా మందికి లక్కీ డ్రాలో ఒక్క మద్యం దుకాణం కూడా రాకపోవడంతో నిరాశ‌, నిస్పృహ‌ల‌తో వెనుదిరిగారు..

అయితే, మ‌రికొంద‌రికి మాత్రం అదృష్టం వ‌రించింది. కొంద‌రు ఒకే మ‌ద్యం దుకాణానికి టెండ‌ర్ వేసినా వారికి ద‌క్కింది. అదే స‌మ‌యంలో కొంద‌రికి మాత్రం రెండేసి షాపులు ద‌క్కాయి. అందులో నిర్మ‌ల్ జిల్లా(Nirmal District)కు చెందిన ఓ మ‌హిళ‌కు రెండు మ‌ద్యం దుకాణాలు ద‌క్కాయి. లక్కీ డ్రాలో ఒకే మహిళకు రెండు మద్యం దుకాణాలు రావ‌డం గ‌మ‌నార్హం. నిర్మల్ జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న గుజ్జుల‌ హారిక అనే మ‌హిళ లక్ష్మణ చందా, పొనకల్ గ్రామాల్లో రెండు మద్యం దుకాణాలకు టెండర్లు వేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) ఆధ్వర్యంలో నిర్వహించిన లక్కీ డ్రా లో ఆమెకు రెండు మద్యం దుకాణాలు ద‌క్కించుకుంది. రెండు షాపులు త‌న‌ పేరు మీద రావ‌డంతో ఆమె ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like