ఒకే గ్రూపునకు నాలుగు మద్యం షాపులు
మంచిర్యాల జిల్లాలో ఒకే గ్రూపునకు వరుసగా నాలుగు ఊళ్ళలో వైన్ షాపులు దక్కాయి. లక్షెట్టిపేట, జన్నారానికి చెందిన 29 మంది కలిసి 29 దరఖాస్తులు చేసుకున్నారు. వీరికి లక్షెట్టిపేటలో ఒకటి, ముత్యంపేటలో ఒకటి, మేదరపేటలో ఒకటి, జన్నారంలో మరొకటి నాలుగు షాపులు దక్కాయి. దీంతో ఆ గ్రూపు సభ్యులు సంతోషంతో ఉన్నారు.