రాష్ట్ర పౌర‌సర‌ఫ‌రాల సంస్థ చైర్మ‌న్‌గా ప్రేంసాగ‌ర్ రావు

Premsagar Rao appointed as Chairman of State Civil Supplies Corporation:రాష్ట్ర పౌర‌సర‌ఫ‌రాల సంస్థ చైర్మ‌న్‌గా ప్రేంసాగ‌ర్ రావును నియ‌మిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు సైతం జారీ చేసింది. మంత్రి ప‌ద‌వి కోసం ఆశించిన ప్రేంసాగ‌ర్ రావుకు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేదు. దీంతో ఆయ‌న బ‌హిరంగంగానే అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్ర పౌర‌సర‌ఫ‌రాల సంస్థ చైర్మ‌న్‌గా ప్రేంసాగ‌ర్ రావును నియ‌మిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొలువు దీరాక త‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని ప్రేంసాగ‌ర్ రావు ఆశించారు. అయితే, అధిష్టానం ఆయ‌న ఆశ‌లు అడియాశ‌లు చేస్తూ ఆ ప‌ద‌విని గ‌డ్డం వివేక్‌కు క‌ట్ట‌బెట్టింది. ఆయ‌న‌కు ఢిల్లీలో ఉన్న ప‌రిచ‌యాలతో మంత్రి అయ్యారు. పార్టీ కోసం పనిచేయడమే కాదు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ ను గట్టెకిస్తే త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌కుండా పార్టీలు మారిన వివేక్‌కు ప‌ద‌వి ఎలా ఇస్తారంటూ ప్రేంసాగ‌ర్ రావు పార్టీపై అలిగారు. ఒకానొక ద‌శ‌లో ఆయ‌న అధిష్టానంపై కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగ రేవంత్ రెడ్డి మొదటి సభ ఇంద్రవెల్లి దండోరా… భట్టి విక్రమార్క పాదయాత్ర… మంచిర్యాల నిర్వహించిన సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి ఖార్జున ఖర్గేను తీసుకొచ్చి భారీ బహిరంగ సభను విజ‌య‌వంతం… ఇలా అన్ని చేస్తే ప‌ద‌వి ఆయ‌న‌కు ఇవ్వ‌డం ఏమిట‌ని బ‌హిరంగంగా విమ‌ర్శించారు.

ఆయ‌న ఆగ్ర‌హం… సొంత పార్టీలో సైతం నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. ఒకే ఇంటి నుంచి ముగ్గురికి టిక్కెట్లు, వివేక్‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం ప‌ట్ల కాంగ్రెస్ శ్రేణులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అది కూడా వేరే పార్టీ నుంచి వ‌చ్చిన వారిని అందలం ఎక్కించ‌డం ఏమిట‌నే ప్ర‌శ్న‌లు వ‌చ్చాయి.. దీనిని గ్ర‌హించిన అధిష్టానం ఇప్పుడు రాష్ట్ర పౌర‌సర‌ఫ‌రాల సంస్థ చైర్మ‌న్‌గా ప్రేంసాగ‌ర్ రావును నియ‌మిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like