అజారుద్దీన్‌కు రెండు శాఖలు కేటాయింపు
Minister Azharuddin : రాష్ట్ర మంత్రి అజారుద్దీన్‌కు ప్రభుత్వం శాఖలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అజారుద్దీన్‌కు మైనార్టీ సంక్షేమ శాఖ(Minority Welfare Department)తో పాటు పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖ (Department of Public Enterprises) కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 31న అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ప్రమాణస్వీకారం చేసిన నాలుగు రోజులకు అజారుద్దీన్‌కు శాఖ కేటాయించారు. మొత్తంగా రాష్ట్ర కేబినెట్లో మంత్రుల సంఖ్య 15కు చేరింది. మరో రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి.
హోంశాఖ ఇస్తారని ప్రచారం జరిగినా…
అజారుద్దీన్‌కు హోంశాక ఇస్తారని ప్రచారం సాగింది. ఆయన కూడా అదే కావాలని పట్టుబట్టినట్లు వార్తలు వచ్చాయి. గత ప్రభుత్వంలో మహమూద్ అలీకి ఈ శాఖ అప్పగించారు. ఇప్పుడు కూడా అదే ఆనవాయితీ కొనసాగుతుందని అనుకున్నారు. అయితే, ఆయనకు మైనార్టీ సంక్షేమ శాఖ, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖలు కట్టబెట్టారు.