ఫోన్ మాట్లాడుతూ.. పిల్ల‌ల‌తో కాళ్లు ప‌ట్టించుకుంటూ..

Srikakulam tribal ashram school Teacher: పిల్లలకు పాఠ‌శాలు చెప్పాల్సిన ఓ టీచ‌ర‌మ్మ‌… తాపీగా ఫోన్వి మాట్లాడుతూ వారితో కాళ్లు పట్టించుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లాలో వెలుగు చూసింది. ఉపాధ్యాయురాలు సెల్ ఫోన్లో మాట్లాడుతూ.. ఇద్దరు విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

పిల్లలకు అన్నీ తామై విద్యా బుద్దులు నేర్పి వారిని ప్రయోజకులుగా మార్చాల్సిన టీచ‌ర్లు త‌మ వృత్తిని మ‌ర్చిపోయి ప్ర‌వ‌రిస్తున్నారు. నేటి కాలంలో టీచర్లలో అంకిత భావం కరువైంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా విధానంపై ఇప్ప‌టికే త‌ల్లిదండ్రులు పెద‌వి విరుస్తున్నారు. కొందరు టీచర్లు కేవలం జీతాల కోసం మాత్రమే మొక్కుబడిగా పాఠశాలలకు వ‌స్తున్నార‌ని ప‌లువురు త‌ల్లిదండ్రులు ఆరోపిస్తుండ‌గా, కొన్ని ఘ‌ట‌న‌లు వాటిని నిజ‌మ‌ని నిరూపిస్తున్నాయి. బాధ్యతారహితమైన ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చి టేబుల్‌పై పడి గుర్రుపెట్టి నిద్రపోవడం, పిల్లలతో తల దువ్వించడం, పేలు చూపించడం, వారితో ఇతర పనులు చేయిస్తున్నారు. అడపా దడపా ఇలాంటి సంఘటనలు నిత్యం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఓ టీచర‌మ్మ‌ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడానికి బదులు కుర్చీలో కూర్చుని పిల్లలతో కాళ్లు పట్టించుకుంది. కుర్చీ వెనక్కి వాలి సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ విలాసవంతంగా ఇద్దరు విద్యార్థినులతో చెరొక కాళ్లు నొక్కించుకుంటున్న వీడియో బయటకు వచ్చింది. వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఈ ఘటన పై ఐటీడీఏ సీతంపేట పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ ఉపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసు జారీ చేశామని, విచారణకు ఆదేశించామన్నారు. మరో వైపు ఆ ఉపద్యాయురాలు మాత్రం కాలుబెనికింది విద్యార్థులు సహాయం చేస్తున్నారని చెప్పుకువ‌చ్చింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like