రోడ్డుపైనే లంచం
ACB Trap: కొమురం భీమ్ జిల్లాలో ఓ అధికారి ఏకంగా రోడ్డుపైనే లంచం తీసుకుంటూ దొరికిపోయారు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులను చూసి పారిపోతుండగా, వారు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే… కొమురం భీమ్ జిల్లాలో పౌరసరఫరాల శాఖ డీఎం నర్సింగరావ్ ఏసీబీ వలలో చిక్కుకున్నారు. పీడీఎస్ రైస్‌ను మిల్లు నుంచి గోదాం తరలించే విషయంలో లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రూ.75 వేల లంచం తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వాళ్లను చూసిన డీఎం మంచిర్యాల ఆసిఫాబాద్ రోడ్డు పైన పారిపోతుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.