బీహార్‌లో దూసుకుపోతున్న ఎన్డీఏ

Bihar Election Result:బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని సాధిస్తోంది. పోస్టల్‌ బ్యాలెట్‌ల లెక్కింపుతోనే హ‌వా మొద‌లు పెట్టిన ఎన్డీఏ, అనంతరం ఈవీఎంల లెక్కింపు తర్వాత మరింత వేగంగా దూసుకెళ్లింది. తాజా గణాంకాల ప్రకారం, మొత్తం 243 స్థానాలున్న బీహార్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 122 మ్యాజిక్‌ ఫిగర్‌ను అధికార కూటమి దాటేసింది. ప్రస్తుతం ఎన్డీఏ మొత్తం 159 స్థానాల్లో ఆధిక్యంలో నిలిచింది. జేడీయూ-బీజేపీ కూటమి ఈ బలమైన ఆధిక్యంతో రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వెళ్లే పరిస్థితులు స్పష్టమవుతుండగా, బీజేపీ కార్యకర్తలు ఇప్పటికే సంబరాలు ప్రారంభించారు. స్వీట్లు పంచుకుంటూ, బాణాసంచా కాల్చుతూ విజయోత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. మరోవైపు, విపక్ష ఇండియా కూటమి 66 స్థానాల్లో కొనసాగుతోంది.

బీహార్ మొత్తం 243 శాసనసభ స్థానాలుండగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 122 సీట్లు కావాలి. ఇప్పటికే ఎన్డీయే కూటమి మ్యాజిక్ ఫిగర్ ని దాటేసింది. ప్రస్తుతం 159 స్థానాల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహాగర్బంధన్ కూటమి అభ్యర్థులు 71 స్థానాల్లో ముందంజలో ఉంగా. మరో 4 చోట్ల ఇతరులకు ఆధిక్యంలో ఉన్నారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా మొత్తం 159 స్థానాల్లో బిజెపి 65, జెడియు 73, ఎల్ జేపీ 15, హెచ్ ఏ ఎం 2, స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక 82 స్థానాల్లో మహా ఘట్ బంధన్ ఆధిక్యంలో కొనసాగుతుండగా, 6 స్థానాల్లో ఇతర పార్టీలు ముందంజలో ఉన్నాయి. ఇక మహా ఘట్ బంధన్ లోని పార్టీల విషయానికి వస్తే ఆర్జేడీ 59 ,కాంగ్రెస్ 18, వీఐపీ 2, లెఫ్ట్ 3 స్థానాల్లో కొనసాగుతున్నాయి. న్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) స్థాపించిన ‘జన సురాజ్’ పార్టీ, తొలిసారి ఎన్నికల బరిలో దిగి సత్తా చాటుతోంది. ఈ పార్టీ ప్రస్తుతం 3 స్థానాల్లో ముందంజ లో ఉంది.

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like